సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మహిళ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలను రాజకీయంగా పెద్దపీట వేస్తూ రాజకీయంగా వారికి సముచిత స్థానం కల్పిస్తూ, రాజకీయాల్లోకి భాగస్వాములు చేసేదాని కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన వీర మహిళ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఐదు మండలాల్లో మహిళా విభాగాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారి సూచనల మేరకు నియామక కార్యక్రమం చేపట్టామని అన్నారు. అందులో భాగంగా శనివారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు గుమ్మినేని వాణి భవాని సమక్షంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం గోవిందరాజుపురానికి చెందిన కంటే శ్రీలక్ష్మిని మండల మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగిందన్నారు. ఆయన నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మహిళా శక్తిని తయారుచేసి మహిళలు అన్ని రంగాల్లో కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా మహిళలకి చేతనందించే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలంగా పల్లెల్లో మహిళలని ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానించి, వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వాళ్లకి అనేక విధాలుగా జనసేన పార్టీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కంటే సుధాకర్, సుబ్రమణ్యం, ఖాదరవల్లి, పవన్, జాకీర్, కోటి, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, ముత్తుకూరు మండల నాయకులు అశోక్, సుమన్, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com