ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో మండల తహసిల్దార్ కార్యాలయం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొబ్బేపల్లి సురేష్ బాబు గారు కొందరు మండలం నాయకులతో కలిసి పొదలకూరు మండలంలో ఏర్పాటు చేయబోయే మినీ స్టేడియం ఏదైతే ఉందో దానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఖరారు చేయాలని మండల కార్యాలయం నందు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి గ్రామం నందు రాధాకృష్ణ గారి పూర్వీకులు సర్వేపల్లి నివాసులు కావడం అదే విధంగా ఉత్తమ ఉపాధ్యాయుడుగా, మొట్టమొదటి రాష్ట్రపతిగా సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి అదేవిధంగా సర్వేపల్లి పేరు వారి ఇంటిపేరు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే కొన్ని వేల మంది క్రీడాకారులను తయారుచేసే మినీ స్టేడియంకి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చే పథకాలు ప్రజల సొమ్ముతో కుటుంబ సభ్యులు పేర్లు రాసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం సొమ్మొకడిది సోకు ఒకడిది అనే విధంగా ఉన్నాయి. అయితే జనసేన పార్టీ ఒకటే ఆడుగుతుంది ఏదైనా పథకాలను ప్రవేశ పెట్టేటప్పుడు స్వతంత్ర సమరయోధులు పేర్లు పెడితే ఎంతో బాగుంటుందని మేము ఎన్నో సార్లు తెలియచేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలలో మార్పు వస్తే కానీ ఎది కొనసాగే పరిస్థితులు లేవు. ఈరోజు జనసేన పార్టీ ఒకటే కోరుతా ఉంది ఈ మిని స్టేడియంకి మాత్రం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అలా జరగని పక్షంలో మేము నిరసన దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ తరుపున తెలియజేస్తూన్నాము. ఈ కార్యక్రమంలో స్థానికులు దర్శి శివ, వంశి, సాయి అనిల్ తదితరులు పాల్గొన్నారు.