సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన విజయ యాత్ర నాలుగో రోజైన గురువారం వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి ప్రారంభమై గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి చేరుకుంది. నిడిగుంటపాళెం నుండి ప్రారంభమైన పాదయాత్ర ఇస్కపాళెం, కొర్లపాడు సంఘం, సర్వేపల్లి, తిక్కవరప్పాడు, గొట్లపాలెం గ్రామాలు మీదుగా గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమానికి చేరుకొని రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుంచి కాపాడాలని కోరుకున్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేనల ఉమ్మడి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావాలని, సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుపొందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి పాలన నుంచి విముక్తి ఆంధ్ర ప్రదేశ్ కావాలని, రేపు 2024లో జరగబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని విజయవంతంగా అత్యధిక మెజార్టీతో సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిపించాలని కోరారు. గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న విజయ యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలను ఆ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ రేపు 2024 ఎన్నికలలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్ధిని విజయవంతంగా గెలిపించుకొని ఈ విజయ యాత్ర అనే విజయవంతం చేసుకుని సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతారని ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రావూరు రాధాకృష్ణ నాయుడు, జనసేన వీర మహిళ గుమినేని వాణి భవాని, వెంకటాచలం మండల నాయకులు పెనిశెట్టి మల్లికార్జున్, కార్యదర్శి శ్రీహరి దయాకర్ చెంచయ్య, రామిరెడ్డి, వెంకీ, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, మస్తాన్, పసుపులేటి మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com