Logo
Date of Publish : 15 July 2021, 3:11 pm
Editor : Sake Naresh

స్మశానం అక్రమానికి గురైందని, చర్యలు తీసుకోవాలని అధికారులకి విన్నవించిన సర్వేపల్లి జనసేన నాయకులు

              సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వే పల్లి పంచాయతీ పరిధిలోని లింగంగుంట గిరిజన కాలనీ గిరిజన కాలనీ ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది. అయితే ఈ గిరిజనులు కుటుంబాలలో ఎవరైనా కాలం చెల్లితే పక్కనే ఉన్న స్థలంలో స్మశానవాటిక వాడుకునేవారు అయితే ఆ స్మశానవాటిక అనుకొని పొలాలు ఉండటంతో కొందరు రైతులు ఆ స్మశానాన్ని ప్రతి సంవత్సరం కొంచం కొంచం పొలాల్లో ఆక్రమించుకోవడం జరిగింది.  ఇప్పుడు వాళ్ళకి స్మశానం లేకపోవడం అదేవిధంగా చెరువు కట్ట అంచున ఎక్కడ దొరికితే అక్కడ దహన సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మండల తహశీల్దార్ గారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే గిరిజనుల సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని అలా జరగని పక్షంలో గిరిజనులు పక్షాన నిలబడి జనసేన పార్టీ నిరసన దీక్ష చేసేందుకు కూడా మేము సిద్ధమే అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, కాకి శివ కుమార్, సుధాకర్, బాబు, సుబ్రమణ్యం, కోటేశ్వరరావు, ప్రసాదు, వెంకట రమణయ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com