సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలంలో బుధవారం అంగన్వాడీల సమ్మెకు మాజీ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మద్దతు తెలిపిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ వెంకటాచలంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు తన వంతు మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున సహయ, సహకారాలు అందిస్తాను. రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదు. అదేవిధంగా న్యాయబద్ధంగా అంగనవాడి టీచర్లు అంగన్వాడి ఆయాలు 10 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది ఇప్పటివరకు దానిపైన పూర్తిస్థాయిలో స్పందించిన దాఖలాలు అందుకు నిరసనగా వాళ్లు చేస్తున్న నిరవధిక నిరసన దీక్షకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా వాళ్లు చేస్తున్న నిరసన దీక్షకి వాళ్ళ సొంత డబ్బులతో సెంటు వేసుకొని ఇబ్బంది పడుతున్నారు. అందుకుగాను మూడు రోజులపాటు టెంట్ కు ఖర్చులు మేం బారాయిస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంగనవాడి ఆయాలుగా బీఈడీ చేసి అందులో పని చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు ఈరోజు రాష్ట్రంలో పెరిగిన కరెంట్ బిల్లులు పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు పెరిగిన ఆర్టీసీ చార్జీలు పెరిగిన ఇసుక ఇలా చెప్పుకుంటూ పోతే పెరిగిన గ్యాస్ పెరిగిన పెట్రోల్ డీజిల్ అనేక విధాలుగా ప్రజల పైన భారం మోపుతారు. అంగనవాడి వాళ్లకి కనీస జీతాలు పెంపు లేకుండా వాళ్ళ పైన భారాన్ని పెంచి కనీసం వాళ్ళకి రిటైర్మెంట్ గాని ప్రభుత్వం నుంచి పథకాలు అందడం గాని ఏవి జరగకపోవడం ఉద్యోగానికి భద్రత లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. 2024 లో ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలుపుతూ వెంటనే ప్రభుత్వము చర్చలు జరిపి వాళ్ల డిమాండ్ల పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ వెంకటాచలం మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, వీర మహిళ గుమ్మినేని వాణి భవాని మండల కార్యదర్శి శ్రీహరి, ఐటి విభాగం పసుపులేటి ప్రసాద్, పొదలకూరు మండల అధ్యక్షుడు అనిల్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com