Logo
Date of Publish : 07 September 2023, 9:36 pm
Editor : Sake Naresh

కాలుష్యం కోరల్లో బ్రతికి ఉండడానికే పోరాటం చేస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం

           కొవ్వూరు ( జనస్వరం ) : యాష్ పాండ్ల వలన తమ జీవితాలు దుబ్బరం అవుతున్నాయని గిరిజన నాయకుల సమాచారం మేరకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బిడ్డలకు వస్తున్న చర్మవ్యాధులను కాలుష్యం బారిన పడిన స్థానికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బ్రతికి ఉండడానికి పోరాటం చేస్తున్నారు ఇక్కడ గిరిజనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే దుమ్ము దూళి తో పర్యావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. మనుషుల ఆయుర్దాయం తక్కువ.మొక్కలు కూడా ఎదిగే పరిస్థితి లేదు.జీవనాధారమైన చెరువు హాష్ఞ పాండ్తో నిండిపోయింది. చిన్న బిడ్డలకు ఒళ్లంతా కురుపులు ఏ మందు వాడినా తగ్గని లేదు. గడప గడపకి వచ్చిన కాకాని గారు గిరిజన కాలనీ మొదట్లోనే వెనుతిరిగాడు.స్థానికులంతా ముట్టడించడంతో సమస్యలు అడిగి సైలెంట్ అయిపోయాడు. దాదాపు 80 గడపలు 300 మంది నివసిస్తున్న ఈ ప్రాంత వాసులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు ఇప్పిస్తే వెళ్ళేందుకు వీరందరూ సిద్ధంగా ఉన్నారు. తమ పార్టీకి ఉపయోగపడతారని,పెత్తందారికి వ్యవస్థకు తోడు ఉంటారని ఇళ్ళు ఉన్న వారికే ఇచ్చే బదులు ఇటువంటి వారికి ఇల్లు ఇస్తే ఒక సముదాయాన్ని కాపాడిన వారు అవుతారు.  సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం.. సమస్య పరిష్కరించి వీరికి పౌనరావాసం కల్పించే వరకు కూడా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో ప్రశాంత్ గౌడ్,హేమచంద్ర యాదవ్, ఆమీన్, ఖలీల్, కేశవ,మౌనిష్ వర్షన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com