Logo
Date of Publish : 06 May 2023, 11:21 am
Editor : Sake Naresh

అన్నదాత కష్టంపై స్పందన లేని సర్కార్ : కందుల దుర్గేష్

         రాజమండ్రి ( జనస్వరం ) : బొండాలు సాగు చేసే రైతులు నానా కష్టాలు పడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు  కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో బుధవారం రైతుల కడగండ్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. చేతికి అందిన పంట అకాల వర్షాల దెబ్బకు నీటి పాలు కావడం తో రైతులు ఏం చేయాలో తెలియక అయోమయంలో కనిపించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ అకాల వర్షాల దెబ్బకు పంటలు నష్టపోతున్నా, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. మద్దతు ధర రూ.1530 లకు తడిచిన ధాన్యాన్ని కొంటామనే మాట చెప్పడం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్తే రూ.200, రూ.300 తక్కువకు కొంటామని బేరాలు ఆడుతున్నారన్నారు. కౌలు రైతులు అప్పులు చేసి సాగు చేస్తే చివరికి వాళ్ళకి రూపాయి కూడా దక్కని పరిస్థితి కనపిస్తోందన్నారు. ఈ పర్యటనలో కందులు దుర్గేష్ తో పాటు నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నాగు, మండల అధ్యక్షులు వీరబాబు, ప్రసాద్ రెడ్డి , మహిళా నాయకురాలు  పాటంశెట్టి కాశీరాణి, జన సైనికులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com