కూకట్ పల్లి ( జనస్వరం ) : బహుజన విప్లవకారుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని బాలానగర్ లో వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాడిన యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ గడ్డం నాగరాజ కిషోర్, కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, వేముల మహేష్, నాగేంద్ర మరియు బాలనగర్ జనసేన పార్టీ నాయకులు ఎస్.కె .నాగూర్, నరేష్ వెంకట్రావు, రాము జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com