నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 130వ రోజున 50వ డివిజన్ సంతపేట ప్రాంతంలోని సుందరగిరివారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం కోసం తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటలో భాగంగా గత 4 రోజులుగా సంతపేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటే పారిశుద్ధ్య లేమి స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయన్నారు. సైడు కాలువలు, డ్రైనేజి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం నెల్లూరు సిటీలోని ప్రాంతాల కనీస అభివృద్ధికి కూడా నిధులు కేటాయించలేని స్థితిలో ఉందని, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కేవలం బినామీ కాలువల కాంట్రాక్టులు, కమీషన్ల మీదే దృష్టి పెట్టి నియోజకవర్గంలోని ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.