రాజంపేట ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలను శనివారం పలు మండలాలలో అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధులుగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్, రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట పట్టణంలోని మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోటీలలో పలువురు వీర మహిళలు వేసిన ముగ్గులను ఎంతోమందిని ఆకర్షించాయి. పలువురు మహిళలు విరివిగా పాల్గొని పోటా పోటీగా రంగవల్లలను వేయడం జరిగింది. అనంతరం రాజంపేట సమన్వయకర్త అతికారి దినేష్, పార్టీ నాయకులు అతికారి కృష్ణ మాట్లాడుతూ ఈ సంక్రాంతి ప్రతి కుటుంబంలో సంతోషాలను వెల్లి విరియాలన్నారు. ఇక వైసిపి పాలన ముగియడం తప్పదని రానున్నది జనసేన, టిడిపి పాలన అని ఆయన అన్నారు. ఈ సంక్రాంతి వైసిపి వారికి చివరి పండగ అన్నారు. ఈ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలు పండుగ అనే మాటను మరిచారన్నారు. నిత్యావసరు సరుకులను అన్ని పెనుభారంగా మారడం జరిగిందన్నారు. వీటన్నీటి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉందన్నారు. అనంతరం గెలుపొందిన వీరమహిళలకు నగదు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మొదటి బహుమతిగా వీర మహిళకు 30 వేలు, రెండవ బహుమతి గెలుపొందిన వారికి 20 వేలు, మూడవ బహుమతి పొందిన వీర మహిళకు 10 వేల రూపాయలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట, నందలూరు మండలాలకు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పలువురు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com