
గజపతినగరం ( జనస్వరం ) : నియోజకవర్గం ఇంచార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో జనవరి 13 & 14 వ తేదీల్లో మన ఊరు.. మన ఆట” కార్యక్రమం జరిగింది. సంస్కృతులను కాపాడే సమాజం జనసేన సప్త సిద్ధాంతాలలో ప్రధానం. సంక్రాంతి పండుగ తెలుగు వారికి శతకోటి సంబరాల సంస్కృతిక సమ్మేళనం. కొత్త ఉషస్సులు తీసుకువచ్చే పెద్ద పండగ వేళ మన నియోజకవర్గ ఇంచార్జి మర్రాపు సురేష్ గారి సహకారంతో జనసేన వీరమహిళ విభాగం ఆధ్వర్యంలో “మన ఊరు.. మన ఆట”అంటూ రంగ వల్లులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళామణులు పాల్గొని రకరకాల రంగవల్లులు అలంకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడమే కాకుండా పోటీలో పాల్గొన ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. స్థానిక మహిళలు గ్రామస్తులు నుండి అనూహ్య స్పందన లభించింది. మహిళామణులకు నూతన ఉత్సాహం అందించడమే కాకుండా గ్రామస్థాయిలో మన జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.