దెందులూరు ( జనస్వరం ) : దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు లక్ష్మీ, ఆదిశేషు గార్ల ఆధ్వర్యంలో వేగివాడ గ్రామంలో దెందులూరు నియోజకవర్గ మన ఊరు మన ఆట సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిధిగా కాట్నం విశాలి పాల్గొన్నారు. ఆమె ముగ్గులను పరిశీలించి మహిళలకు తమ సూచనలు అందచేసారు. వీరమహిళలందరూ కలిసి తమ నియోజకవర్గం విచ్చేసిన విశాలి గారికి సన్మానం చేసారు. తదనంతరం విజేతలకు కొఠారు లక్ష్మీ ప్రధమ బహుమతి 5000, ద్వితీయ 3000, తృతీయ 2000 నగదు బహుమతులు అందచేసారు. తొలి మూడు కన్సొలేషన్ బహుమతులుగా 1000 చెప్పున మూడు నగదు బహుమతులు, తరువాత మూడు కన్సొలేషన్ బహుమతులుగా మూడు చీరలు బహుమతులుగా అందచేసారు. పోటీదారులందరికీ పార్టిసిపేషన్ గిఫ్టులు అందచేసారు.