Logo
Date of Publish : 16 January 2023, 2:06 pm
Editor : Sake Naresh

నరవ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు

      పెందుర్తి, (జనస్వరం) :  పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామంలో స్ధానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ అధ్యక్షతన జనసేనపార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే సంక్రాంతి సంబరాలులో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలు, పిల్లలకు సంగీతం పోటీలు, భరతనాట్యం, పిల్లల వేషధారణ, వంటి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీర మహిళలు పిన్నంటి పార్వతి, కర్రీ మౌనిక, వబ్బిన మీనాక్షి పాల్గొన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి నరవ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రోజురోజుకీ గ్రామ ప్రజల నుంచి మహిళ నుంచి మాపై చూపిన అభిమానం పెరుగుతూ వస్తుందని ఇంత చక్కనైన కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దీని వెనకాల ఎంతో మంది జనసైనికులు కష్టం ఉందని వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. పిల్లలు చక్కనైన సంగీతమైన స్వరాలతో మమ్మల్ని అలరింప చేశారు. ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ నృత్యాలతో మమ్మల్ని ఆకట్టుకున్నారని వారి గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, జనసేన పార్టీ అంటే గ్రామంలో ప్రతి కార్యక్రమానికి మా యొక్క మద్దతు ఉంటుందని గ్రామ అభివృద్ధిలో మా భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని పవన్ కళ్యాణ్ నాలుగో సిద్ధాంతమైన సంస్కృతులను కాపాడే సమాజంలో భాగంగా ఈ సంబరాలు ప్రతి యేటా జరుపుతామని మా యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ముఖ్య అతిథులు పిన్నంటి పార్వతి మాట్లాడుతూ ముగ్గుల పోటీలో విజేతలు నిర్ణయించడం చాలా కష్టతరమైన పని అయిందని ప్రతి మహిళ పోటాపోటీగా ముగ్గులు వేయడం జరిగిందని చిన్నచిన్న విషయాలు పరిగణన తీసుకొని మొదట రెండవ మూడవ విజేతలుగా నిర్ణయించాము అని ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా విజేతలుగా నిర్ణయించి బహుమతులు ఇవ్వడం చాలా ఆనందదాయకమని ఈ గ్రామంలో ప్రతి సమస్యపై శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గళం వినిపిస్తుందని, మొదటి బహుమతిగా గెలిచిన రేవతికి రెండో బహుమతి గెలిచిన లీల కుమారికి మూడో బహుమతి గెలిచిన లక్ష్మీకి అభినందనలు తెలియజేసుకుంటామని మాట్లాడడం జరిగింది. కర్రీ మౌనిక మాట్లాడుతూ ముగ్గులు పోటీతో పాటు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ఆలోచించబడిన విషయమని, ఇదే స్ఫూర్తి అన్ని గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకుంటే గ్రామాలలో ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఇంత మంచి ఆలోచన ఉన్న జనసేన పార్టీకి ఈ యొక్క సంస్కృతి కార్యక్రమాలు గురువులైనటువంటి గంతకూరు విజయకి ఆరాధన చిల్డ్రన్ హోమం అమ్మ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అని మాట్లాడం జరిగింది. వబ్బిన మీనాక్షి మాట్లాడుతూ మా యొక్క నరవ గ్రామంలో నాలుగోసారి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు మరియు గెటప్స్ వేసుకొని వచ్చిన చిన్న పిల్లలకు, సంస్కృతి కార్యక్రమాలు వేసిన పిల్లలకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ యొక్క కార్యక్రమాల్లో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సన్మానం చేయడం మంచి విషయంగా పరిగణిస్తున్నామని, అరకొర విద్యా వ్యవస్థలు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి సమాజానికి తెలియజేయడానికి ఇటువంటి సంబరాల్లో ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని వారికి వారి తల్లిదండ్రులకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఏటా మీరు ఇదే విధంగా జనసేన పార్టీని సపోర్ట్ చేసినట్లయితే ఇంతకన్నా వైభవంగా జనసేన పార్టీని ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుందామని దీనికి సహకరించిన జనసైనికులకు వీర మహిళలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డునాయుడు, బొబ్బర శ్రీను, గవర శీను, పట్నాల శివ, బొండాల రవికిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com