Logo
Date of Publish : 17 January 2022, 2:40 pm
Editor : Sake Naresh

తణుకులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

         తణుకు ( జనస్వరం ) : నియోజకవర్గం 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో జనసేన పార్టీ తరపున నిర్వహించిన ముగ్గుల పోటీలలో కాలనీలోని మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంతో సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అత్తిలి గ్రామ సర్పంచ్ శ్రీమతి గంటా విజేత, అర్జునుడుపాలెం సర్పంచ్ పోతుల గంగాధరం గంటా నాగరాజు, మరియు స్ధానిక పెద్దలు పోతుల కాశీ అన్నపూర్ణ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుకూల రమేష్ మాట్లాడుతూ ఎంతో అందంగా తీర్చి దిద్దిన ముగ్గులు వలే ఈ సంవత్సరం మనందరి జీవితాలలో హరివిల్లులాగా అందంగా ఉండాలని, అలాగే కరోనా ఒమిక్రాన్ వైరస్ సోకకుండా మాస్కులు, శానిటైజర్లు వాడాలని దూరం పాటించాలని తెలియజేశారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా పిలిస్తే చాలు వెంటనే వస్తానని రమేష్ తెలియజేశారు. గంటా విజేత గారు మాట్లాడుతూ ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు నింపాలన్నారు. పోతుల గంగాధరం మాట్లాడుతూ ఈ సంక్రాంతి మనందరిలో నూతనొత్తేజం నింపాలని ఆ భగవంతుడిని కోరుతున్నానన్నారు. ముగ్గులు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సొలేషన్ బహుమతులు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, కృష్ణవేణి, రాజు గారు, అడబాల మణికంఠ, తమరపల్లి బాల సాయి, నెయ్యల శివకృష్ణ, ఆవాల వెంకట సాయి, రాము, మోహన్, శ్రీను, ష్యామ్, ముగ్గిన శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com