ఏలూరు, ఏప్రిల్ 13 (జనస్వరం) : రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన అరాచక వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలంతా సంసిద్దంగా ఉన్నారని టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేసే లక్ష్యంతో టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏలూరు నియోజకవర్గం 2,3 వ డివిజన్లోని బావి శెట్టి వారి పేటలో నిర్వహించిన సంకల్ప యాత్రలో కార్యక్రమంలో కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, మాజీ ఊడ చైర్మెన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం పాల్గొన్నారు. వారు డివిజన్లోని ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోనికి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి, ఆయా పథకాలపై వారికి అవగాహన వాటిపై భరోసాను కల్పించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించాలని కోరారు. అధిక శాతం ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.. కూటమి ప్రభుత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి బడేటి చంటిని భారీ మెజారిటీతో గెలిపించాలని రెడ్డి అప్పల నాయుడు స్థానిక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులతోపాటు ఏలూరు నగర జనసేన అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, మీడియా ఇంచార్జ్ జనసేన రవి, జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు, నూకల సాయి ప్రసాద్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, గొడవర్తి నవీన్, కురెళ్ళ భాస్కర్, సోషల్ సర్వీస్ మురళి, నిమ్మల శ్రీనివాసు, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, కొసనం ప్రమీల, గాయత్రి, తుమ్మపాల ఉమా దుర్గ భారీ సంఖ్యలో జనసేన తెలుగుదేశం, బిజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com