ఆమదాలవలస ( జనస్వరం ) : పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలోను ఆ తరువాత నిర్వహించిన పాదయాత్రలోనూ మున్సిపల్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికులందరిని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో రెగ్యులర్ చేసి సమాన పనికి సమానం వేతనం చెల్లిస్తామని పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని నాడు హామీ ఇచ్చారని కానీ నేటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కరించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. నిత్యాసరాల ధరలు బగ్గు మంటున్నాయని ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఎలా బతికేదని కుటుంబాలను ఎలా పోషించుకునేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులు కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ సగం జీతం పెన్షన్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్నది జనసేన టిడిపి సంకీర్ణ ప్రభుత్వమేనని మేం అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు, సరుబుజ్జిలి జనసేన మండలాధ్యక్షుడు పైడి మురళీమోహన్, జనసైనికులు కోటేశ్వరరావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.