పలాస, (జనస్వరం) : పారిశుద్ధ్య లోపంతో ప్రజలు రోగాలకు గురవుతున్నారని పలాస నియోజకవర్గ జనసేన నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్ అన్నారు. ఈ విషయంపై బుధవారం నాడు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం డీఈఈ ఎన్. వి. వి నారాయణకు వినతిపత్రాన్ని అందించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో విషజ్వరాల నివారణ కొరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలని, కొన్ని సలహాలుతో కూడిన సూచనలు ఆయన ఇచ్చారు. ఇటీవల పడిన భారీ వర్షాల ఫలితంగా మున్సిపాలిటీ వార్డులలో చాలా వరకు మురికి నీరు నిల్వ ఉండడంతో, దోమలు తమ సంతానోత్పత్తిని పెంచి, ప్రజలకు వివిధ రోగాలను కలుగజేస్తున్నాయని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో డిడిటిని పిచికారీ చేయాలని ఆయన కోరారు. వార్డులలో జ్వరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను తెలుసుకొని, ప్రతిరోజూ ఆ వార్డులకు ఫాగింగ్ మెషిన్‌ను పంపాలని ఆయన సూచించారు. మున్సిపాలిటీలో 14 15, 16 వార్డ్ ప్రజలు నిల్వ ఉండే నీటితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, పద్మనాభపురం కాలనీలో ఉండే 8వ సచివాలయంకు వెళ్లి, సమస్య మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని అక్కడ సిబ్బందిని కోరానని ఆయన తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com