సంగం, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో తూర్పు హరిజన వాడకు చెందిన యోబు సెంట్రింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు ఇనుపరాడ్ మీద కరెంట్ తీగలు పడి చేతులకు దెబ్బతగిలాయి. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇల్లు జరగడం కష్టం అవుతుంది. వాలంటీర్లు అతనికి పింఛను రాయకుండా ఆలస్యం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సంగం మండలం జనసేన సీనియర్ నాయకులు కూనపల్లి శ్రీ హరి అధికారులతో వాదన పడి అతనికి పింఛను వచ్చేలా కృషి చేశారు. ఇప్పుడు అతనికి పింఛను వస్తుంది. అలాగే ఆ కుటుంబానికి నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కూనపల్లి శ్రీహరి, దాడి బాను కిరణ్, ఆకులేటి సాయి చంద్, పెళ్లి మల్లి, రామిశెట్టి యస్వంత్, డి నరేష్ తదితరులు పాల్గొన్నారు.