
సిద్దవటం ( జనస్వరం ) : మండలంలోని జంగాలపల్లి గ్రామంలోని ఇసుక రీచును నిర్వాహకులు నిబంధనల మేరకు నడపాలని జనసేన నాయకుడు అతికారి దినేష్ స్పష్టం చేశారు. మండలంలోని జంగాలపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జంగాలపల్లిలోని ఇసుక రీచును నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజల వైపునుంచి జనసేన ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇసుక రీచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు పోయిన బాదితురాలికి ఆర్ధిక సహాయం అందిస్తే సరిపోదని ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం వచ్చేలా కృషి చెయ్యాలన్నారు. ఇసుక రీచు నుంచి వెళ్లే వాహనాలు ఎక్కువ టన్నేజ్ తీసుకెళ్తుండడంతో రోడ్లు దెబ్బతిన్నాయని రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జంగాలపల్లి రోడ్డు ప్రమాద బాదితులకు ఆర్ధిక సహాయాన్ని అందించడంతో పాటుగా సిద్దవటంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడ్డ సలీం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.