Search
Close this search box.
Search
Close this search box.

మయోసైటిస్ పై సమంత యుద్ధం.. ప్రజల్లో అవగహన కల్పించడమే..

సమంత

          ఏమాయ చేసావే తో తెలుగు తెరకు పరిచయమై.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు సంపాదించుకుంది సమంత. కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. యశోద సమయంలో ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. అయితే మొదట్లో ఈ వ్యాధి గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. చాలా కాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆమె.. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితిని పూర్తిగా వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మయోసైటిస్ సమస్య గురించి తెలియజేసింది. అయితే సామ్ ఈ సమస్య గురించి చెప్పినప్పిప్పుడు చాలా మందికి మయోసైటిస్ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఇక ఆ తర్వాత ఆమెను స్పూర్తి పొంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చాలా మందికి బయటకు తెలియజేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా మంది తాము ఇబ్బందిపడుతున్న సమస్యల గురించి బయటకు చెప్పారు.

             అయితే మయోసైటిస్ నుంచి కాస్త కొలుకున్న సామ్ ఆ తర్వాత ఖుషి, సిటాడెల్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ లు చేస్తోన్న సమయంలోనే మరోసారి ఈ వ్యాధితో సామ్ ఇబ్బందిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సామ్ అమెరికా వెళ్లింది. దాదాపు సంవత్సరం పాటు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో ఇప్పటికే తీసుకున్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ రెమ్యూనరేషన్స్ తిరిగి ఇచ్చేశారని టాక్ నడిచింది. ఇక ప్రస్తుతం అమెరికాలో ఉన్న సామ్.. మయోసైటిస్ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. మయోసైటిస్ పై అవగహాన కల్పించేందుకు.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపేందుకు పోరాడుతున్న వారి జీవితాలకు తోడు ఉండనుంది సామ్. ఇకపై ప్రజలలో మయోసైటిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించనుంది. మయోసైటిస్ ఇండియాకు ప్రచారకర్తగా ఉండనుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక సమంత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. తాను పోరాడుతున్న వ్యాధిపై అవగాహన కల్పించేందుకు సామ్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఉపయోగపడుతుందని.. నిజంగా ఇది హర్షించతగిన నిర్ణయమంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇటీవల సామ్ నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way