విశాఖలో జనసేన పార్టీ తరుపున హీరోలకు వందనం
26/11 ముంబై దాడుల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన ధైర్య వీరులకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కోరమాండల్ గాంధీ బజార్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది. మా హీరోలకు వందనం. ఎందుకంటే వారు పోరాడుతారు మరియు వారు మన కోసం తమ జీవితాన్ని కోల్పోతారు అంటూ నినాదాలు ఇచ్చారు. దాదాపు పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తాజ్ హోటల్‌పై బాంబులతో దాడులు చేశారు. 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు అని అన్నారు. ఈ దాడిలో మరణించిన పౌరులు, సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.