గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ నియోజకవర్గం, గుత్తి మండలం, కరిటికొండ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుత్తి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో "జాతీయ రైతు దినోత్సవం" పురస్కరించుకొని రైతులతో మమేకమవుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతులతో చర్చించుకుంటూ, గ్రామంలోని వ్యవసాయ భూములను జనసేన నాయకులు జనసైనికులు సందర్శించి అనంతరం రైతన్నలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ రైతులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధానాలను అమలుపరిచి రైతు సంక్షేమం కోసం జనసేన పార్టీ పని చేస్తుందని భరోసానిచ్చారు, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు "కౌలు రైతు భరోసా యాత్రలో" 3 వేలకు పైగా కుటుంబాలకు ఒకరికి 1 లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నారు అని తెలియజేశారు. ఏ పార్టీ ఆలోచించని విధంగా రాబోయే రోజుల్లో రైతులకు పెన్షన్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టేలా జనసేన పార్టీ కృషి చేస్తుంది అని, అన్నదాత ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని. వ్యవసాయం ప్రధానమైన మనదేశంలో రైతాంగం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, ముఖ్యంగా పాలకులు ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభం దిశగా వెళ్తుందని, పంట కాలువల నిర్వహణను విస్మరించారు, రైతు భరోసా కేంద్రాలను ప్రచారం కోసమో, ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు తప్ప రైతులకు మాత్రం లబ్ధి చేకూరడం లేదు ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా లేదు అమ్మిన ధాన్యానికి ఎప్పుడు డబ్బులు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది, రాష్ట్ర ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని ప్రచారం కోసం వాడుకుంటుంది తప్ప వారికి చేయూతనిచ్చి నిలబెట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు... ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, గుత్తి మండల అధ్యక్షులు చిన్న వెంకటేశులు, గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుత్తి మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర ఖాదర్, వలీ, వంశీ, హరికృష్ణ షేక్షావలీ, రఫీ, విజయరాజు, రామకృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com