ప్రైవేట్ కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు అందించాలి : సికబడి జనసైనికులు
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. వీరికి 12 నెలలతో కూడిన రెన్యువల్ ఇవ్వాలని కోరుతున్నాము అని జియ్యమ్మవలస జనసైనికులు కోరారు. గత6నెలలుగా జీతాలు రాకపోవడంతో చాలా మంది జూనియర్ లెక్చరర్లక రోడ్డు మీద పడ్డారు. ఈ కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వం అందరినీ ఆడుకుంటామని హామీ ఇచ్చి, ఇపుడు ప్రైవేట్ టీచర్లను ఆడుకోకపోవడం దారుణం అన్నారు. కొందరు టీచర్లు ఇంట్లో పూట గడవక రోడ్ల మీద పండ్లు అమ్మడం, కూలీ పనులకు వెళ్ళడం చూస్తున్నాం. ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పే గురువులకి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన సహాయం చేయాలని కోరారు. జూనియర్ లెక్చరర్లకు రెన్యువల్ చేస్తూ వాళ్లని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచు జియ్యమ్మవలస మండలం, సికబడి గ్రామంలో జనసైనికులు ధర్నా చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com