నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 271వ రోజున 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని సమూలంగా మార్పు చేస్తానంటూ గత ఎన్నికల ముందు పాదయాత్రలో మాట్లాడిన సీఎం జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నాడు నేడు అని అన్నారని గుర్తుచేశారు. నాడు నేడు అంటే 2019 లో పెద్దగా ఎవరికీ అర్థం కాలేదని, నాడు జీతాలు సక్రమంగా ఒకటో తేదీకి పడుతుంటే, నేడు సక్రమంగా పడట్లేదని, ఉపాధ్యాయులందరూ లోన్ ఈఎంఐల తేదీలు మార్చాలంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, ఇదే నాడు నేడు అని ఎద్దేవా చేశారు. జగన్ వస్తే మెగా డీఎస్సీ వేసి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని అనేక నిరుద్యోగ అభ్యర్థులు ఆశలు పెట్టుకుంటే ఉద్యోగ నియామకాలు కాదు కదా ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని దిగజార్చారని దుయ్యబట్టారు. ఈ అధ్వాన్న పరిస్థితుల్లో మార్పులు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని, ప్రజలందరి ఆశీస్సులతో ఏర్పడబోయే పవనన్న ప్రభుత్వంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.