Logo
Date of Publish : 18 August 2026, 10:16 pm
Editor : Sake Naresh

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన సాకే శైలజానాథ్‌ బృందం

• గార్లదిన్నె పరిస్థితులను వివరించిన మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ నారాయణస్వామి

విజయవాడ, ఆగస్టు 18 (జనస్వరం): వైఎస్సార్‌సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో డాక్టర్‌ సాకే రుత్విక్‌ హృదయ్‌తో పాటు గార్లదిన్నె మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ మూలింటి నారాయణస్వామి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగనమల నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గార్లదిన్నె మండలంలోని స్థానిక పరిస్థితులను మూలింటి నారాయణస్వామి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు. సాకే శైలజానాథ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సింగనమల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com