అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి మీరు ప్రభుత్వ సలహాదారులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కాదని తెలుసుకోండని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారుడుగా ఉంటూ ప్రతినెల ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ ప్రతిపక్షాలను విమర్శించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం కాదా? అని విమర్శించారు. యువగళం ముగింపు సభ విజయవంతం కావడంతో వైసిపి మంత్రులు, మాజీ మంత్రులు ఓర్చుకోలేక పిచ్చి ప్రేలేపనులు పేలుతున్నారు. జనసేన టిడిపి పొత్తుని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని యువగళం సభ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. జనసేన నాయకులు కార్యకర్తలు, టిడిపి నాయకులు కార్యకర్తలు యువగలం విజయవంతం చేయడంతోనే రానున్న ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో స్థాపించబడుతుందని నిర్ధారణ అయిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వైసిపి నాయకులందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాం? పాదయాత్రలో వచ్చే ఎన్నికలలో బ్రాందీ షాపులు లేకుండా చేసి ఎన్నికలకు వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు బ్రాందీ షాపులు లేకుండా చేసి ఎన్నికలకు వస్తున్నారా? లేదా? వారం రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు CPS రద్దు చేస్తామన్నారు చేసినారా? ప్రతి సంవత్సరం నిరుద్యోగస్తులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఇచ్చారాఅని అన్నారు. కాంటాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తామన్నారు చేశారా? ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు పెర్మనెంట్ చేస్తామన్నారు చేశారా? అంగన్వాడి అక్కచెల్లెమ్మల సమస్యలు తీర్చారా? ఆశా వర్కర్ల సమస్యలు తీర్చారా అని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య ఏమైంది? రాష్ట్రానికి ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు? రాష్ట్రంలో ఎన్ని జలవనరుల ప్రాజెక్టులు కంప్లీట్ చేశారా? దాదాపు 8 లక్షల కోట్లు అప్పుచేసి? అభివృద్ధిని పూర్తిగా విస్మరించి? రాష్ట్ర ప్రజలకు జీవనోపాధి లేకుండా అధోగతి పాలు చేసింది వాస్తవం కాదా? నోటికి హద్దు అదుపు లేకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి దమ్ముంటే వచ్చే ఎన్నికలకు రండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు చేతనైతే పై వాటి అన్నింటికీ సమాధానం చెప్పండి? అంతేకానీ అనవసరంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉచిత సలహాలు ఇవ్వద్దని నీకు సూటిగా తెలియజేస్తున్నామని అన్నారు.