Logo
Date of Publish : 15 October 2025, 8:38 am
Editor : Sake Naresh

గుంతకల్‌లో ఘనంగా సాయి ధరమ్ తేజ్ జన్మదిన సేవా కార్యక్రమాలు

     గుంతకల్, అక్టోబర్ 14, జనస్వరం : గుంతకల్ పట్టణంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సేవాస్ఫూర్తి, సామాజిక బాధ్యతతో గుంతకల్ పట్టణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి ధరమ్ తేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. డొక్కా సీతమ్మ, పద్మభూషణ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ లా సేవా భావనతో సమాజానికి తోడ్పడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది.

     ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మెగా కుటుంబం ప్రజాసేవకు నిలువెత్తు ఉదాహరణ అని, అలాంటి సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కురుబ పురుషోత్తం, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ నాయకులు పామయ్య, రామకృష్ణ, గాజుల రాఘవేంద్ర, కథల వీధి అంజి, సుబ్బయ్య, అమర్, హెచ్‌పి‌సి శేఖర్, మంజు, పరశురాం, ముద్దలాపురం ప్రసాద్, శివ, శివ కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమంగా మార్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com