అరకువెలి, (జనస్వరం) : విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అరకువేలి మండలం బొండం పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల్లో నేడు జనసైనికులు ఆయా గ్రామాల జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో జ్వరాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించి ఈ గ్రామాల్లో అందరికీ వైద్య సదుపాయం పూర్తిస్థాయిలో అందుతుందా లేకా నిర్లక్ష్య ధోరణిలో ఆసుపత్రి సిబ్బంది వ్యవహరిస్తున్నారనే విషయంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉన్నాయా లేవా అని గిరిజనులు దగ్గర ఆరా తీశారు. మీకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు వాటిల్లినా మీ పంచాయతీ పరిధిలో కూడా జనసైనికులు ఉన్నారని, వారికి తెలియజేస్తే తక్షణమే ఉన్నతాధికారులకు తెలియజేసి, పరిష్కారం అయ్యేలా చేస్తారని లేకుంటే మీతో మమేకమై సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తారని జనసేన నాయకులు సాయిబాబా తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో గిరిజనులకు అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందాలన్నా, మన్యం అభివృద్ధి చెందాలన్న, పరిపాలన బాగుండాలన్నా జనసేన పార్టీకి మీరు అందరూ కలిసి మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయిబాబా మరియు జనసైనికులు కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com