Logo
Date of Publish : 10 September 2026, 7:35 pm
Editor : Sake Naresh

స్వర్ణ గ్రామ సచివాలయాన్ని సందర్శించిన సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ

హిందూపురం, సెప్టెంబర్ 10 (జనస్వరం): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని ఎస్. సడ్లపల్లి గ్రామం 13వ వార్డు సచివాలయాన్ని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ దాలవాటం మణిప్రియ సందర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయానికి వచ్చిన ప్రజలను ఆమె ఆత్మీయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడి, అర్హులైన ప్రజలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా, ఎవరూ అవకాశాన్ని కోల్పోకుండా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరయ్యే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. “అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరాలి.. ప్రతి అర్హుడికి పెన్షన్ అందాలి” అనే లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మణిప్రియ పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com