పాలకుర్తి ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తల్లికి మరియు తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గార్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడిద ప్రశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం ఒక చారత్రాత్మక ఘట్టం. ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయం. ఈ విజయం కోసం ఎంతోమది ప్రాణాలు దారబోశారు. మరెందరో తమ జీవితాలను అర్పించారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన తెలగాణ రాష్ట్రం. పాలన మారింది కానీ ప్రజలు బతుకులు మారడం లేదన్నారు, ఆర్భాటాలే తప్ప సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఎనిమిదేళ్ల గడిచిన నియామకాలు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. స్వరాష్ట్ర పాలన ఎనిమిదేళ్లుగా నిరుద్యోగ సమస్య పరీక్షించలేదు గుర్తు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పడి నేడు అప్పుల రాష్ట్రంగా మిగిలి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల సైదులు, పూజారి సాయి, N రవి మరియు జన సైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.