రాప్తాడు ( జనస్వరం ) : జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుని ఆరాతీసిన రాప్తాడు జనసేన ఇంచార్జ్ సాకే పవన్ కుమార్. ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు" అనే సామాజిక పరిశీలన కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని సచివాలయాలకి వెళ్లి సదరు టౌన్లో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంపిక అనుసరించిన విధానాలు ఏమిటి, ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎంత మేరకు బిల్లులు మంజూరు చేశారు వంటి విషయాలను సచివాలయ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నామన్నారు. అలాగే కోడిమి పంచాయితిలో జరిగిన అవతవకలపై అధికారులను ప్రశ్నించామని, అర్హులైన వారికి వెంటనే జగనన్న ఇళ్ళు మంజూరు చేయాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com