చీపురుపల్లి ( జనస్వరం ) : గుర్ల మండల, పున్నపురెడ్దిపేట గ్రామంలో వరి పొలాలను జనసేన నాయకులు సందర్శించడం జరిగింది. రైతు గర్జన కార్యక్రమం పున్నపురెడ్డి పేట గ్రామంలో ఉన్నటువంటి పొలాలలో వరిచేనుకి నీరు లేక తోటపల్లి కాలువలు లేక విద్యుత్ సరఫరా లేక చేతుకొచ్చిన పంట నాశనం అయిపోయింది. దీనివల్ల రైతులకి చాలా నష్టం వాటిల్లిందని జనసేన నాయకులు అన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం, రైతు కి తోడుగా ఉందామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు విజయనగరం జిల్లా టీడీపీ ఇంచార్జి మరియు చీపురుపల్లి నియోజకవర్గం ఇంచార్జి కిమిడి నాగార్జున మరియు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తుమ్మగంటి సూరి నాయుడు, విసినిగిరి శ్రీను వాసురావు, దెందులూరు రమేష్ రాజు గారు, రేగిడి లక్షణ్ రావు, అడ్డాల రామచంద్ర రావు, సాసుబిల్లి రాము నాయుడు, ఎచర్ల లక్షము నాయుడు, సిగ తవిటి నాయుడు, శంకర్, రామచంద్ర రావు, రెడ్డి రమణ, వెంకటేష్ జనసేన కార్యకర్తలు. పున్నపురెడ్డి పేట రైతులు మరియు మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com