బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు రోజుల క్రితం కొత్త జీవో తీసుకొచ్చి దివ్యాంగుల మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇస్తానని చెబుతూ, దివ్యాంగుల అందరిలో ఎస్సీ ఎస్టీలుగా కులమతాలు విభజిస్తూ ఉన్నాడు. పదో తరగతి పాస్ అవ్వాలని, పాత బండి ఉంటే కొత్త బండి ఇవ్వనని 45 సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వనని తెలిపారు. ఈ నిబంధనలను వెంటనే తీసివేయాలని దివ్యాంగుల అందరికీ సమానంగా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, ఘంటా నాగమల్లేశ్వర రావుతదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com