●తిరుపతి రుయా హాస్పిటల్లో సోమవారం జరిగిన సంఘటన చాలా బాధాకరం
● తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్
తిరుపతి, (జనస్వరం) : రుయా హాస్పిటల్లో ఉచిత అంబులెన్సుల సర్వీసులు ఉన్నప్పటికీ వారు ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి బాధిత పేషెంట్ల వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు. సోమవారం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు వారి స్వగృహానికి తీసుకువెళ్లాలని ప్రాధేయపడగా వారు ప్రైవేట్ అంబులెన్స్ వారితో కలిసి వారు అడిగిన అధిక రుసుం చెల్లించలేక ఆ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని స్కూటర్ పై తీసుకు వెళ్ళడం చాలా బాధాకరమని కిరణ్ అన్నారు. రుయా హాస్పిటల్లో సంబంధిత అధికారులకు, వైసీపీ నాయకులకు ఈ దందాలో వాటాలు ముడుతున్నాయా? అని అన్నారు. ఈ ప్రైవేట్ అంబులెన్స్ ల వారి ఆగడాలను అరికట్టాలని సంబంధిత అధికారులను జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. బిడ్డ చనిపోయి బాధలో ఉన్నవారిని ఆదుకోవాలే తప్ప పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని, ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని, ఇలానే కొనసాగితే జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జి, సుమన్ బాబు, మునుస్వామి, అమృత, కీర్తన, కోకిల, హేమ కుమార్, మనోజ్, రాజేష్, కిషోర్, సుజిత్ లు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com