మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికాముఖంగా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం అందరికీ తెలిసినదే. డీజిల్ రేటు పెరగడంతో ఆర్టీసీ మేడం 20 కోట్లు నష్టాలతో నడుస్తున్న తరుణంలో బస్సు ఛార్జీలు పెంచామని గవర్నమెంట్ చెబుతుంది. ఈ టైంలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు. ఆర్థికంగా అయితే చాలా బలహీన పడ్డారు. ఈ గవర్నమెంట్ ఎలాంటి ఉపాధి అవకాశాలను ఆర్థిక వనరులను సమకూర్చి ప్రజల జీవన ప్రమాణం రేటును పెంచకపోగా బాదుడే బాదుడు అని అన్ని విధాలుగా రేట్లు పెంచి భరించండని భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఒక్కటి కూడా ఇప్పుడు అమలు చేయకపోగా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసారు. ప్రజలు ఈ బాధలను భరించలేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ప్రెస్ మీట్ మాత్రం ప్రతిపక్షాలను వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటాయి. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com