Logo
Date of Publish : 13 October 2022, 2:40 am
Editor : Sake Naresh

రాయచోటి నుండి సుండుపల్లి మీదగా ఆర్టీసి బస్సులు నిర్ణీత సమయాల్లో నడపాలి

● రాయచోటి డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్
    రాయచోటి, (జనస్వరం) : అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాయచోటి నుంచి సుండుపల్లి మీదుగా రాయవరం, పించ, సానిపాయి, రాజంపేట తదితర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్న ఆర్ టి సి బస్ సర్వీసులు ప్రయాణికులకు అనుకూలమైన సమయాల్లో, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, పాలకులు, సంబంధిత శాఖ అధికారులు తక్షణమే యుద్ధప్రాతిపదికన స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్కూల్, కాలేజి వెళ్ళే విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యార్థంగా బస్ స్టాప్ లు ఉండాలని అలాగే సుండుపల్లి మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి వందల వేల మంది ప్రజలు రాజంపేట, పీలేరు, తిరుపతి అలా దూరప్రయాణాలు చేసే ప్రయాణికులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్ షెల్టర్ వద్ద మహిళలను, వృద్ధులను, విద్యార్థిని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి సంబంధిత శాఖ అధికారులు మరుగుదొడ్లు వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షైక్ రియాజ్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com