Search
Close this search box.
Search
Close this search box.

జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

     జంగారెడ్డిగూడెం, (జనస్వరం) : జంగారెడ్డిగూడెం సమీపంలో చోటు చేసుకున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందారనే విషయం ఆవేదన కలిగించింది. ఎంతో బాధాకరమైన ప్రమాదమిది. వంతెనపై నుంచి జల్లేరు వాగులోకి బస్సు పడిపోవడం వల్ల ఈ ఘోరం సంభవించడం దురదృష్టకరం. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలి. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం చేసి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way