
అనంతపురం ( జనస్వరం ) : జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి చేపట్టీన కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. జిల్లా కేంద్రంలోని బుడ్డప్ప నగర్ లో ఉన్న రాజేంద్ర మున్సిపల్ స్కూల్ అపరిశుభ్రతకు ఆనవాలుగా తయారైంది. చెత్తాచెదారంతో నిండిపోయింది. కలుపు, కంపచెట్లు అధికం కావడంతో పురుగుబుట్ట, పాములు సైతం తిరుగుతున్న దుస్థితిని చూసి చలించిపోయిన ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. ఆ పాఠశాలలో శ్రమదానం చేయాలని సంకల్పించిన జయరామిరెడ్డి తన సొంత నిధులు రూ. 25 వేలు వ్యయం చేసి ట్రాక్టర్‌తో ఆ ప్రాంతాన్ని అంత చదును చేయించారు. తాను కొంత మంది జనసైనికులతో కలిసి స్వయంగా శ్రమదానం చేశారు. పార చేత పట్టి, కలుపు మొక్కల్ని తీసి పారేసి, కంప చెట్లను తొలగించారు. చెత్తాచెదారాన్ని ఎత్తివేసి, పరిశుభ్రం చేశారు. దీంతో రాజేంద్ర మున్సిపల్ స్కూల్ రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పాఠశాల పరిసరాలను సొంత నిధులు, శ్రమధానంతో బాగు చేసిన జయరామిరెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. వెల్‌డన్ జయరామిరెడ్డి అంటూ అభినందిస్తూ… ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జయరామిరెడ్డి మాట్లాడుతూ… తమ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నాడు ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో తాను రాజేంద్రమున్సిపల్ స్కూల్‌లో శ్రమదానం చేయాలని సంకల్పించానన్నారు. ఈ కార్యక్రమంలో తనకు సహకరించిన చిరంజీవి యువత అధ్యక్షులు జనసేన రాష్త్ర కార్యక్రమాల నిర్వహక కార్యదర్శి భవాని రవికుమార్, జనసేన నాయకులు మెరుగు శ్రీనివాస్, హస్సేన్, పవన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మార్గదర్శకంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సేవా, సామాజిక కార్యక్రమాల్లో కూడా తాము ముందుంటామని జయరామిరెడ్డి పేర్కొన్నారు.