Logo
Date of Publish : 14 February 2026, 8:34 pm
Editor : Sake Naresh

శివాలయానికి రూ. లక్ష విరాళం : కోమలపాటికి ఘన సత్కారం

అనంతపురము, ఫిబ్రవరి 14, జనస్వరం : అనంతపురం ఒకటోరోడ్ లోని శ్రీకాశీ విశ్వేశ్వర కోదండరామస్వామి దేవాలయములు పునః నిర్మాణం కోసం పలువురు దాతలు ముందుకొస్తున్నారు. విశ్రాంత ఇంజనీర్ కోమలపాటి సుధాకర్ బాబు శనివారం రూ. 1,00,116 (ఒక లక్ష నూటపదహార్లు) విరాళమిచ్చారు. ఆలయ సమూహాల అధునీకరణకు రూ. 4.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం అనుమతిచ్చింది .ఈ నిర్మాణం కొరకు మాచింగ్ కాంట్రిబ్యూషన్ క్రింద భక్తులద్వారా రూ. 90 లక్షలు విరాళములు సేకరించాలి. ఇందులో భాగంగా శివాలయం కమిటీ విరాళాలు సేకరించు కార్యక్రమం చేపట్టింది. ఏపీ ఎస్పీడిసిఎల్ విశ్రాంత ఈ.ఈ కోమలపాటి సుధాకర్ బాబు తనవంతుగా ఒక లక్ష నూట పదహారు రూపాయలు (రూ. 1,00,116) అందజేశారు. అలాగే ఎస్కేయూ మాజీ రిజిస్ట్రార్ కొండ్ర సుధాకర్ బాబు రూ. 15,116/-, గాలి హేమంత్ కుమార్, రూ. 10,001/- ఆలయ పునః నిర్మాణము కొరకు విరాళమిచ్చారు. ఈ బృహత్తర విరాళాల కార్యక్రమములో ఆలయ కమిటీ చైర్మన్ అమిలినేని నరేంద్ర చౌదరి, కార్యనిర్వహణ అధికారి కే. నాగేంద్రుడు, కమిటీ సభ్యులు డి. రాజు, ఎం.ఎస్.ఆదిశేషయ్య, చిన్ని, ఎర్రిస్వామి, ఇంజనీర్ సుధాకర్ బాబు కుటుంబ సభ్యులు భార్య శైలజ, కూతురు కుమారి తేజస్విని, అల్లుడు జగదీశ్ ఫణికుమార్, కూతురు శ్రీమతి హర్షిణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు రూ. 50 లక్షలు విరాళములు సేకరించమన్నారు. ఈ శివాలయం పునః నిర్మాణం కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాలుపంచుకొని, విరివిగా విరాళమిచ్చి, మహాశివుని కృపకి భాగస్వామ్యం కావాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com