సుండుపల్లి, (జనస్వరం) : సుండుపల్లి, వీరబల్లి మండలాలు రాయచోటి రెవెన్యూ డివిజన్లో కలపాలని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను అఖిలపక్ష కమిటీ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని నూతన జిల్లాగా చేసుకోవడంలో భాగంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నమయ్య పేరుతో నూతన జిల్లాగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగిందని దీనికి సంతోషిస్తున్నామని అయితే కడప రెవెన్యూ డివిజన్ నుండి సుండుపల్లె వీరబల్లిని తొలగించి రాజంపేటలో కలపడం జరిగిందిని అయితే రాజంపేటకు వెళ్లాలంటే దాదాపు యాభై కిలోమీటర్ల ప్రయాణంతో పాటు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో పాటు కనీసం బస్సు సహకారం కూడా లేదని రెండు ఘాట్లు రోడ్ల మధ్య అడవిమార్గాన రాక పోకలకు మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని కనుక రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు పునరాలోచించి సుండుపల్లె మరియు వీరబల్లి మండలాలు రాయచోటి రెవెన్యూ డివిజన్లకు చేర్చి సహకరించాలన్నారు. మండలంలోని ఎంపీపీలు, జడ్పీటిసిలు, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు మెంబర్లు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, కులసంఘాల నాయకులు, విలేకరులు, గ్రామపెద్దలు, వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు కార్మికులు, విద్యార్థినీ విద్యార్థులు యువత మండల అభివృద్ధిని ప్రతి ఒక్కరు 4 వ తేదీన జరిగే మహార్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆజంతమ్మ, అభిలపక్ష కమిటీ కన్వీనర్ విశ్వనాథ నాయక్, గౌరవ సలహాదారులు యర్రపురెడ్డి అజయ్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, పాత్రికేయ సంఘం నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com