ఆముదాలవలస ( జనస్వరం ) : ప్రజాస్వామ్యం - చట్టబద్ధపాలన విషయాలు పై ఈరోజు NGO హోం లోకసత్తా పార్టీ రాష్ట్ర నాయకులు పంజాది రాంబాబు అధ్యక్షతన అఖిలపక్ష పౌరసమాజ, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మరుము ప్రకాష్ కపిల ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశానికి ఆహ్వానం మేరకు ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు హాజరై ప్రజాస్వామ చట్టబద్ధపాలన పై జనసేన వాణిని వినిపించారు, ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను గురించి ప్రశ్నించే గుంతెను నొక్కుతుందని అక్రమ అరెస్టులు, కేసులతో ఇబ్బందులకు గురిచేస్తుందని ఇదేనా ప్రజాస్వామ్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఎన్నికల వెళ్లే విధానాలు మారాలి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నాయకులును ఎన్నుకోవాలి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో K. పోలినాయుడు, B. కృష్ణమూర్తి, Ch. గోవింద్ రావు, D . రమణ, M. వెంకటేష్, D. మల్లీ బాబు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com