సూళ్ళూరుపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా పబ్లిక్ ప్లేస్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అధికార వైసిపి నాయకులు పెట్టారు. ప్రభుత్వం నాయుడుపేట పట్టణంలోని వివిధ కూడళ్ళలో వేయడం హేయమైన చర్య అని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ మీడియా ముఖంగా వైసిపి దుశ్చర్యలపై ధ్వజమెత్తారు. రాజకీయాల్లో పొత్తులు అనేటివి సర్వసాధారణం, ఆ పొత్తులను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారి ఫోటోని వ్యంగంగా ఫ్లెక్స్ లో వేయడం మనసుకు ఎంతో బాధించి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మాత్రమే ఫ్లెక్స్ నుండి తొలగించామని అన్నారు. లా అండ్ ఆర్డర్ దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా ఏ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య విద్వేషాలు రాకుండా ఫ్లెక్స్ ని అలాగే ఉంచామన్నారు. ఈ విషయమై నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారికి పలు మార్లు ఫోన్ కాల్ చేసిన స్పందించకపోవడంతో స్థానిక నాయుడుపేట పోలీస్ స్టేషన్లో SHO గారిని కలిసి జరిగింది వివరించి ఫ్లెక్సీలను తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని స్థానిక వైసీపీ శాసనసభ్యులు ఇలాంటివి ప్రోత్సహించడం సబబు కాదు అని జనసేన కార్యకర్తల మనోభావాలతో చెలగాటం ఆడే ప్రయత్నాలు చేయొద్దు అని సోమశేఖర్ సూటిగా తెలియజేశారు. ఏ పార్టీ కార్యకర్త అయినా నాయకులైన ప్రజల కోసమే పని చేయాలి తప్ప ఇలా విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయడం సమాజానికి కీడు చేయడం లాంటివి అని తెలియజేశారు.