Logo
Date of Publish : 15 May 2023, 4:55 pm
Editor : Sake Naresh

గ్రామాల్లో ఉన్న రోడ్లను బాగు చేయాలని వైసీపీ నాయకులను హెచ్చరించిన రోసనూరు సోమశేఖర్

    సూళ్లూరుపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ దొరవారి సత్రం మండలం ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి మరియు ప్రధాన కార్యదర్శి మణి ఇచ్చిన సమాచారం మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ వారితో వెళ్లి గ్రామంలోని రోడ్లను పరిశీలించారు. హైవే నుంచి పాలెంపాడు మీదుగా వేణుంబాక గ్రామం వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు. దారి పొడవునా పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా తయారైందని, అభివృద్ధిపై నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైసీపీ పాలనపై సోమశేఖర్ అసహనం వ్యక్తపరిచారు. అలానే వేనుంబాక జనసైనికులను కలిసి రోడ్డు గురించి అధికారులతో చర్చిద్దామని హామీ ఇచ్చారు. అధికారులను ఉద్దేశించి వేణుంబాక రోడ్డు విషయంలో చొరవ తీసుకోవాలని వారిని అభ్యర్ధించారు. అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే దిశగా మొదలుపెట్టిన మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం గురించి వివరించారు. అదేవిధంగా గతంలో పాలెంపాడు గ్రామంలో వీధిలైట్లు సమస్య మరియు కరెంటు పోలు పడిపోయే పరిస్థితిలో ఉంది, ఆ ప్రాంతంలో పసిపిల్లలు తిరుగుతూ ఉంటారు అని స్థానికులు తెలియజేయగా AE గారికి మరియు సెక్రటరీ గారికి ఫోన్ కాల్ చేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా జనసేన తరపున సోమశేఖర్ అభ్యర్థించారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని బదులిచ్చిన అధికారులు ఇరువురికి ధన్యవాదాలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com