Logo
Date of Publish : 12 June 2023, 3:08 pm
Editor : Sake Naresh

“మన ఇల్లు – మన జనసేన” కార్యక్రమం నిర్వహించిన రోసనూరు సోమశేఖర్

         సూళ్ళూరుపేట ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం మాంబట్టు పంచాయితీలో సుమారు 180 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ తడ మండల కార్యదర్శి ఈదూరు కాశీ ఆధ్వర్యంలో మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ స్థానిక సమస్యలను ప్రజలను నేరుగా అడగగా డ్రైనేజ్ వ్యవస్థ, అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని, త్రాగు నీరు లాంటి పలు సమస్యలు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చి, సామంతులకు ధనవంతులకు మాత్రమే న్యాయం జరుగుతుంది, సామాన్యులకు న్యాయం జరగడం లేదు, వర్షం వస్తే మునిగే మాంబట్టు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అని స్థానికులు వాపోయారు. అధికారులతో పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది, అలాగే జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తడ మండల ప్రధాన కార్యదర్శులు చేని ముని శేఖర్ మరియు పులి దిలీప్ కుమార్, స్థానిక జనసైనికులు ఈదూరు కుమార్, సంజీవ్, నరేంద్ర, వెంకీ, సురేష్, రవి వర్మ, లోకేష్, కిషోర్ తదితరులు పాల్గొని పవనన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com