సూళ్లూరుపేట ( జనస్వరం ) : నియోజకవర్గం పెళ్లకూరు మండలం జంగాలపల్లి, ఎడిపూడి గ్రామాల్లో మరియు సంబంధిత ఆదివాసీ కాలనీల్లో ఉన్న సుమారు 210 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ సందర్శించారు. మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం నిర్వహించి, అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ , స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడగగా ముఖ్యంగా ఎడిపూడి గ్రామస్థులు మాకు పిడికిటిమాల నుంచి ప్రధాన రోడ్డు నిర్మించండిని కోరారు. ప్రయాణాల్లో వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడుతామని పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది. అలానే పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శశి, మద్దిలేటి సురేంద్ర, సాయి, పండు, మౌళి, గోపి మరియు స్థానిక జనసైనికులు పాల్గొని పవన్ అన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com