Search
Close this search box.
Search
Close this search box.

సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యేపై రోసనూరు సోమశేఖర్ ఫైర్

     సూళ్లూరుపేట ( జనస్వరం ) :  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే గారు తన ఉనికిని చాటు కోవడం కోసం చేసిన దిగజారుడు వ్యాఖ్యలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ తిప్పి కొట్టారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ గారు మరియు వైసీపీ నేతలు ప్రజలకు సంబంధించిన డేటా ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు వెళుతుంది అని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రోజున గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వాలంటీర్ అనే సమాంతర వ్యవస్థను మీరు తీసుకొచ్చి అదే తప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డేటాను హైదరాబాద్ నానకరం గూడా లోని ఎఫ్ఓఏ అనే కంపెనీకి ఎలా వెళుతుంది అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగితే అది మీకు ఇప్పుడు తప్పనిపించిందా? అని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారిని ప్రశ్నించారు. ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నెలకు సుమారు 127 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఈ వాలంటీర్ వ్యవస్థ మీ వైసీపీ పార్టీ మనుగడ కోసం కాదా అని సోమశేఖర్ ప్రశ్నాస్త్రాలు సందించారు. పబ్లిక్ సభల్లో ప్రతిపక్ష నేతలపై సద్విమర్శలు చేయడం రాజకీయాల్లో ఆరోగ్యకరం, కానీ అందుకు భిన్నంగా దిగజారుడు మాటలు మాట్లాడటం మీకు మీ నాయకుడికి అలవాటుగా మారటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర ప్రదేశ్ ను మీ వైసీపీ హయాంలో చేయగలిగారు, ఇది మీరు సాధించిన ఘనత అని వాపోయారు. జాబ్ క్యాలెండర్ లేదు, పోలవరం పూర్తి కాదు, మధ్యం పూర్తిగా నిషేధం అని మహిళలకు కల్లబొల్లి మాటలు చెప్పి మీరే పిచ్చి మద్యాన్ని తయారు చేస్తూ అధిక రేట్లు పెంచి రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజానీకం జీవితాలపై దెబ్బ కొడుత్తున్నారు, రోడ్లు నిర్మించరు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అంగన్వాడీ ఆశ వర్కర్లకు జీతాలు సమయానికి ఇవ్వరు, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగులకు కనీస వేతనం 20000 రూపాయలు చేయలేరు, ఇష్టానుసారంగా కరెంటు బిల్లులు పెంచుతారు, పెట్రోల్ డీజిల్ రెట్లు మీద స్టేట్ ట్యాక్స్ తగ్గించరు, వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచుకుంటూ పోతారు, కౌలు రైతులను పట్టించుకోరు, అమ్మఒడి ఇద్దరికి అని చెప్పి ఒకరికే ఇస్తారు అందులో సగం కేంద్ర ప్రభుత్వంది అది కూడా అందరికీ ఇవ్వరు. వారం రోజుల CPS రద్దు గోవిందా! పరిశ్రమలు తీసుకురాక పోగా ఉన్న పరిశ్రమలు ధన దాహంతో తరిమిగొట్టడం ఆఖరికి అండర్ వేర్ సంస్థ జాకీతో సహా అని వైసీపీ అసమర్ధత పాలనపై సోమశేఖర్ ధ్వజమెత్తారు. 10 యేళ్లు ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కాదు చేతనైతే ఉన్న ఈ కొన్ని మాసాలైన నియోజక అభివృద్ధిపై దృష్టి సారించాలని, ముఖ్యంగా షార్ పరిసర ప్రాంతాలైన పులికాట్ మీదుగా కొరిడి పేర్నాడు గ్రామాలకు వెళ్లే రోడ్డు కనీసం ఈ ఒక్కటైనా నిర్మించాలని వైసీపీ ఎమ్మెల్యే గారికి సోమశేఖర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way