తిరుపతి, (జనస్వరం) : తిరుపతిలో ఈ రోజు ప్రెస్ క్లబ్ నందు ఇంఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్లా నాయక్ చిత్రాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సినిమా విజయవంతంగా ముందుకు వెళుతోందని అన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలే తప్పా సినిమాలు మీద కాదని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మార్వో స్థాయి అధికారులను టికెట్లు పరిశీలించాడనికి పంపించడమేంటి..? అని మండిపడ్డారు. సినిమా హాల్ వద్ద రెవిన్యూ అధికారులను చూస్తుంటే జాలివేస్తోందని అన్నారు. పాపం అధికారులకు ఆదివారం కూడా సెలవు లేదు. థియేటర్ల వద్ద టికెట్లు చించుకుంటూ కూర్చున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపై టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు పవన్ కళ్యాణ్ చిత్రానికి మద్దతు పలకడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక షో టికెట్లు మొత్తం కొని తన అనుచరులతో అమ్మించారని ఆరోపించారు. మంత్రి వర్గంలో చోటు కోసం రోజా అనవసర ఆరోపణలు చేయడంపై కిరణ్ మండిపడ్డారు. రోజా నోరు పారేసుకోవడంవల్లే ఇప్పటివరకు ఉన్నత పదవులు పోయాయని ఎద్దేవా చేశారు. రోజా మాట్లాడే ముందు ఆమె కూడా ఒక నటి అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అలాగే సినిమా సక్సెస్ అవడంతో పేర్ని నాని ముఖం మాడిపోయిన మసాలా దోసెలా తయారైందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శలు రాజేష్ యాదవ్, బాబ్జీ, హేమకుమార్, కీర్తన, సుమన్ బాబు, మునిస్వామి, శేష, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.