Logo
Date of Publish : 05 December 2023, 9:37 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ

    నూజీవీడు ( జనస్వరం ) : నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో రమణక్కపేట గ్రామంలో బిసి కాలనీలలో వర్షం కారణంగా అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మీద జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు స్థానిక నాయలుకులతో కలిసి సందర్శించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలాలలో దాదాపు అన్ని ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిధులను వాడుకుంటూ గ్రామ అభివృద్ది, సమస్యలను గాలికి వదిలేసింది అని సర్పంచులు కూడా చేసేది ఏమి లేక చేతులెత్తేశారు. పంచాయితీరాజ్ శాఖ అధికారులు కూడా నిధులు లేవని మేము చేసేది ఏమి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పంచాయితీలకు నిధులు మంజూరు చేసి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుతో పాటు మండల గ్రామ నాయకులు ఉప్పే నరేంద్ర, వల్లూరి సింహాచలం, చిరంజీవి, తల్లిబోయిన సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com