కువైట్ ( జనస్వరం ) : కువైట్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లోనైనా జనసేన పార్టీకి ఎన్నోసేవా కార్యక్రమాలు చేసిన రామ చంద్ర నాయక్ ని ఆర్ కె ఆర్ సేవా సమితి అధ్యక్షులు అంజన్ కుమార్, కార్యవర్గ సభ్యులు కలిసి వశిష్టత జన బంధు అవార్డుతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గల్ఫ్ జాతీయ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ నాయుడు విచ్చేసారు. రామ్ చంద్ర నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఆర్ కె ఆర్ సేవా సమితి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సేవా సమితి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మరింత ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేఆర్ సేవా సమితి అధ్యక్షులు పగడాల అంజన్ కుమార్, డాక్టర్ అబ్దుల్ నాజర్, సింగిరి కన్నయ్య, గుంటూరు శంకర్, మర్రి రెడ్డయ్య, చింతల వెంకటేష్, అప్పిన చిరంజీవి, దండు వేణు, కుంచా నాగేష్ రెడ్డయ్య, ఆర్కేఆర్ సేవా సమితి కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com