గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక తట్టివర్రు రోడ్డులో పేద ప్రజల మధ్యలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి నూతన వస్త్ర బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సర్వ మానవాళి సుభిక్షంగా ఉండాలని ఆ ఏసుక్రీస్తుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని,త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియచేసారు అని నేటి ప్రపంచంలో క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శప్రాయం. క్రీస్తు చెప్పినట్లే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న సిద్ధాంతాన్ని నేను ఆచరిస్తు అదేవిధంగా మనతోపాటు పేద ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పేద ప్రజల మధ్యలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని, క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, మట్ట జగదీష్, చరణ్ తేజ్, శివ, గంట అంజి, నాగ సాయి, సతీష్ ,మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com